- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్టెల పొయ్యి మీద వంట- సీపీఎం వినూత్న నిరసన
దిశ, కూకట్పల్లి: పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తు బాలానగర్ రాజుకాలనీలో సీపీఎం నాయకులు శనివారం కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం మండల కార్యదర్శి ఐలపురం రాజశేఖర్ మాట్లాడుతూ 4 వందల రూపాయలు ఉన్న గ్యాస్ ధర 900 రూపాయలకు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నెత్తురు తాగుతున్నారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలు కొనుకునే స్థాయిలో లేకుండా పెంచుతున్నారని అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోలేని ఇటువంటి ప్రభుత్వలు ఇంకా కొనసాగడం సిగ్గు చేటు అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు ధరలు తగ్గించాలని మాట్లాడుతూనే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీనీ ఎత్తివేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించిన ఏ ప్రభుత్వం నిలిచినట్లు చరిత్రలో లేదని, ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు చేసి గద్దె దించుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శంకర్, చైతన్య, జగన్, భారతి, సరిత, ఉమా, నరేష్, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.