ఆ హత్యలన్నీ… ప్రభుత్వ హత్యలే

by Shyam |
ఆ హత్యలన్నీ… ప్రభుత్వ హత్యలే
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: నూతన రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతో ఇసుక మాఫియా, భూ రియల్టర్లు ఆగడాలకు అంతే లేకుండా పోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన రాజాపూర్ మండలం తిరుమలాపురం గ్రామంలో ఇసుక మాఫియా మూలంగా హత్యకు గురైన నరసింహులు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఇసుక మాఫియా మూలంగా జరిగిన హత్యలన్నీ, ప్రభుత్వ హత్యలేనని అన్నారు. నర్సింలు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన హంతకులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆ పరిసర ప్రాంతాల్లో ఇసుక ఫిల్టర్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఫిల్టర్ చేస్తున్న ప్రదేశాలను తక్షణం సీజ్ చేయాలని అన్నారు.

ఇకనైనా ఇసుకను తరలించకుండా ప్రజలు వ్యవసాయం చేసుకునేందుకు బోర్లు ఎండిపోకుండా చూడాలని తెలిపారు. ఇసుక మాఫియాను ప్రభుత్వం తక్షణమే నియంత్రించలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇసుక మాఫియా తతంగం ఇంత జరుగుతున్నా జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నట్టు కనపడుతుందని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించి ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని కోరారు.

Advertisement

Next Story