- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ గవర్నర్ అసమర్థుడు : సీపీఐ నారాయణ
దిశ, ఏపీ బ్యూరో: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్ఈసీకే అనుకూల నిర్ణయం వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకుంటే ప్రభుత్వ చేతకానితనమే అవుతోందన్నారు. ఉద్యోగులు సహా ఎవరూ రాజ్యాంగానికి అతీతం కాదని చెప్పారు. రాష్ట్రాలపై 356 అధికరణను ప్రయోగించడానికి సీపీఐ వ్యతిరేకమని ప్రకటించారు. రాష్ర్టంలో ప్రస్తుత గవర్నర్ అసమర్థుడని, రాంలాల్ తర్వాత అత్యంత విఫల గవర్నర్ ప్రస్తుత ఏపీ గవర్నరేని నారాయణ తప్పుబట్టారు. సీఎం జగన్ రచ్చ గెలిచినా ఇంట గెలవలేడని, జగన్ చేతకాని తనం వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చినట్లు పేర్కొన్నారు. జనసేనాని పవన్ తెలంగాణలో పార్టీ నడుపుతున్నప్పుడు షర్మిల ఇక్కడ పార్టీ పెడితే తప్పేంటని నారాయణ ప్రశ్నించారు. షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పుడు సీపీఐ వైఖరి తెలియజేస్తామని నారాయణ ప్రకటించారు.