- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ట్వీట్లు హాస్యాస్పదం.. సీపీఐ నరసింహ కామెంట్
దిశ, ఎల్బీనగర్: ఆరేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హత్యాచారం చేసిన నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హత్యాచార నిందితుడిని శిక్షించాలని సింగరేణి కాలనీలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసులు నిందితుడిని కాపాడేందుకు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని చెప్పిన రెండ్రోజుల తర్వాత పోలీసులు నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం పోలీసులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు తమ పోరాటం ఆగదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శంకర్ నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అంజయ్య నాయక్, సీపీఐ ఐఎస్ సదన్ డివిజన్ కార్యదర్శి షేక్ మహమ్మద్, ఏఐవైఎఫ్ నాయకులు దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.