కేంద్ర, రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి

by Shyam |
కేంద్ర, రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణపై ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. కరోనా కట్టడిలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పును ఒకరిపై మరొకరు నెట్టుకుంటూ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనా చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం హైదరాబాద్‌లో గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసి, ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో పోలీసులు నిరసన కారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed