దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం వివక్ష : జూలకంటి

by Shyam |
దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం వివక్ష : జూలకంటి
X

దిశ, నల్లగొండ: దక్షిణ తెలంగాణపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండల సరిహద్దులోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులకు నిధులు కేటాయించి, పెండింగ్ పనులును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ టన్నెల్ వద్ద సీపీఐ(ఎం) బృందం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ… దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం వివక్ష, నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఈ ధర్నా చేపట్టామన్నారు. పనులు పూర్తి చేయడానికి రూ.3వేల కోట్ల నిధులు అవసరం కాగా.. ప్రభుత్వం కేవలం రూ.3కోట్ల నిధులను విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుతో 3 లక్షల 70 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలోని ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ.. ఎస్ఎల్‌బీసీకి మాత్రం నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే పనులు నెల రోజుల్లో పూర్తవుతాయన్నారు. ఇప్పటికైనా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed