సీఏఏ వ్యతిరేక జీవో తేవాలి

by Shyam |
సీఏఏ వ్యతిరేక జీవో తేవాలి
X

దిశ, న్యూస్ బ్యూరో :
దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సీఏఏ(సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్)ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా జీవోను తీసుకురావాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వంటివి తెచ్చి దేశ ప్రజల మధ్య మత ఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ లీడర్ల చర్యలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయన్నారు. ఎన్‌పీఆర్‌ను అమలు చేసిన రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో అలాంటి విధ్వంసాలకు చోటివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టినంతా మాత్రానా సమస్య పరిష్కారం కాదన్నారు.అందుకు ప్రత్యేక జోవోను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న జనగణన ప్రక్రియలో భాగంగా ఎన్‌పీఆర్ అంశాలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటికి వ్యతిరేకంగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags: caa, npr, nrc bv raghavulu, GO, notification, census, ts govt

Advertisement

Next Story

Most Viewed