- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలు
దిశ, నల్లగొండ: భారత్-చైనా సరిహద్దు ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుంటుబాన్ని సీపీఐ(ఎం) నేతలు పరామర్శించి మాట్లాడారు. భారత ప్రధానమంత్రి మోదీ ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గందరగోళంగా ఉందన్నారు. దేశాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని, మన దేశంలో ఏ సైనికులు కూడా చొర పడలేదని స్పష్టంగా ప్రకటించారని, ఎవరూ చొర పడనప్పుడు ఘర్షణ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. 20 మంది భారత సైనికులు ఎలా చనిపోయారని, దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. విదేశాంగ మంత్రులు, అధికారులు మాట్లాడుతూ.. చైనా సైనికులు మన దేశాన్ని ఆక్రమించారని చెబుతున్నారని, అది నిజమైతే.. ఎంతవరకు ఆక్రమించారో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. తద్వారా ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని కోరారు. ఈ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సంతోష్ బాబు త్యాగం మరువలేనిది ఆయన కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వెంకట్, మల్లు లక్ష్మి, నాగార్జున రెడ్డిలు ఉన్నారు.