కాంగ్రెస్‌కు బూస్ట్.. ‘హస్తం’లోకి భారీగా చేరికలు

by Aamani |   ( Updated:2021-11-13 05:24:03.0  )
కాంగ్రెస్‌కు బూస్ట్.. ‘హస్తం’లోకి భారీగా చేరికలు
X

దిశ, బోథ్ : బోథ్ పట్టణానికి చెందిన, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ నివాసంలో ఆడే గజేందర్ నాయకత్వంలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి సల్ల రవి, ఏఐవైఎఫ్ మండల నాయకులు తిరుపతి, తబ్రేజ్, ముజాహిద్, తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు నరేష్ జాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రఫూల్ రెడ్డి, మండల అధ్యక్షులు కూర్మే మహేందర్, స్థానిక ఎంపీటీసీ షేక్ రజియా బేగం, నాసార్ అహ్మద్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండీ సద్దాం, పసుల చంటి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story