భూ బకాసురులు.. ఆ భూములు కూడా వదలడం లేదు

by srinivas |
CPI National Secretary Narayana
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి సీతమ్మనగర్ భూములను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్థానిక పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ… భూ బకాసురులు పేదల భూములను కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన నిరుపేదల ఇళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీతమ్మనగర్ వాసులకే ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. అంతేగాకుండా.. అర్హులైన అందరికీ ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, త్వరలోనే ఆయనను గద్దెదింపే సమయం ఆసన్నమైందని అన్నారు.

Advertisement

Next Story