- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ మంథని… సీపీ రంగంలోకి దిగింది అందుకేనా?
దిశ ప్రతినిధి, కరీంనగర్: హై కోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు దంపతుల హత్య తరువాత సీపీ సత్యనారాయణ మంథనిలో నెలకొన్న పరిస్థితులను ఫ్యాక్షన్ ను మరిపిస్తోందని కామెంట్ చేశారు. సీపీనే ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగారు. మంథనిలో నెలకొన్న పరిస్థితిలకు పోలీసు మార్కు చికిత్స ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్నకౌంటర్ పోస్టింగ్ లకు పులస్టాప్ పెట్టేలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో మంథనిలో రాజకీయ పార్టీల మధ్య పెరిగిన వైషమ్యాలు నేర ప్రపంచానికి దారి తీస్తున్నాయని గుర్తించిన సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంథని పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా సమవేశం అయి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషన్ కాచె, టీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్, మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు, అసత్య ఆరోపణలకు పాల్పడుతూ వైరం పెంచుకునే సంస్కృతి ఆగిపోవాలని సీపీ స్పష్టం చేశారు. రౌడీషీటర్లకు వీఐపీలు, నార్మల్ అనే తేడా ఉండదన్నవిషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి, అందరిని ఒకే విధంగా పోలీసులు పరిగణిస్తారని, నేరాలకు పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఫ్రతి ఒక్కరిని తాము ప్రత్యేకంగా పరిశీలిస్తామని నేర ప్రవృత్తిని ప్రదర్శించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
వీరిని ఎప్పటికప్పుడు స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తామని, తాము కౌన్సిలింగ్ కు పిలిచినప్పుడు తప్పుడు ప్రచారాలు చేయడం పద్దతి కాదని సీపీ సత్యనారాయణ అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగితే మాత్రం అందులో ఎంతటి హోదాలో ఉన్న వారినైనా తాము వదిలిపెట్టమని ఆయన ప్రకటించారు. హై కోర్టు అడ్వకేట్లు హత్య తరువాత మథనిలో నెలకొన్న పరిస్థితులను ఫ్యాక్షన్ ను మరిపిస్తోందని సీపీ కామెంట్ చేశారు. ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టింగ్ ల పరంపర కొనసాగిస్తుండడంతో సీపీ స్పెషల్ నజర్ వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఏది ఏమైనా మంథనిలో సోషల్ మీడియా వేదికగా పేల్చుకుంటున్న మాటల తూటలే కాకుండా బౌతికంగా చేసుకుంటున్న దాడులు, ప్రతి దాడులు కూడా కట్టడి అయితే బావుంటుందని మంథని జనం అంటున్నారు.