- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి ఆట ఇలా కట్టించాం : సీపీ
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం సీపీ సజ్జనార్ ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. తెలంగాణలో 11, ఏపీలో 19 పెట్రోల్ బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేసి నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఏలూరుకు చెందిన సుభాని బాష, బాజిబాబా, శంకర్, మల్లేశ్వరావు చిప్‌లు ఇన్‌స్టాల్ చేశారని, దీనివల్ల బంకుల్లో వినియోగదారులు పెట్రోల్ పోయించుకున్న సమయంలో 970 ఎల్ మాత్రమే వస్తుందని, కానీ రీడింగ్‌లో మాత్రం 1000 ఎంఎల్ కనపడుతుందన్నారు. నిందితులు ఏకంగా మదర్ బోర్డును రూపొందించి చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడట్లు వెల్లడించారు. 9మంది యజమాలను అరెస్ట్ చేశామని, వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని సీపీ వెల్లడించారు.
ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ జరుపుతున్నామని, అటు ఏపీ పోలీసులకు కూడా సమాచారమిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులు చిప్‌లు ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నామని, చిప్ లను ఏర్పాటు చేసేందుకు వచ్చే వాహనాన్ని సైతం సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు.