- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ. 6 లక్షలు ఇచ్చేసిన యువకుడు.. అభినందించిన సీపీ
దిశ, రాజేంద్రనగర్: రోడ్డుపై దొరికిన నగదు బ్యాగును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ యువకుడు. మైలార్ దేవుపల్లి సీఐ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం…. కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ బిస్కెట్ కంపెనీలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న రణ్వీర్ సింగ్(41) శనివారం ఉదయం కంపెనీ పనిమీద రూ.6 లక్షలు ఓ బ్యాగులో పెట్టుకొని యాక్టివా వాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యలో బ్యాగు కిందపడిపోయింది. ఎంత వెతికినా బ్యాగు దొరకకపోవడంతో తన్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న అశోక్ తివారీ అనే యువకుడు దుర్గానగర్ చౌరస్తా సమీపంలో రోడ్డుపై పడివున్న ఓ బ్యాగును గమనించాడు. దానిని తీసి చూడగా అందులో నగదు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే తాను పనిచేసే కంపెనీ యజమాని రఘువీర్ సింగ్ కు సమాచారమిచ్చాడు. అతని సలహాతో బ్యాగును మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించాడు. బ్యాగు తెరిచి చూసిన పోలీసులు, ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు సరిపోవడంతో రన్వీర్ సింగ్ ని పిలిచి అతనికి నగదు ఉన్న బ్యాగును సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అప్పగించారు. నిజాయితీ చాటిన అశోక్ తివారీని సీపీ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ ప్రకాష్ రెడ్డి, సిఐ నర్సింహ తదితరులున్నారు.