ఖదీర్ మానసిక స్థితి సరిగా లేదు.. మద్యం మత్తులోనే హత్యలు : సీపీ

by  |   ( Updated:2021-11-05 04:42:57.0  )
CP Anjanikumar
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్, నాంపల్లి పరిధిలో ఇద్దరు యాచకులను దారుణంగా హత్య చేసి హల్‌చల్ చేసిన సైకో కిల్లర్‌పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అంతేగాకుండా.. సదరు సైకో కిల్లర్‌పై గతంలోనే నాలుగు కేసులు ఉన్నాయని గుర్తించారు. నిందితుడు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఖదీర్ అని గుర్తించారు. ఖదీర్ మానసిక స్థితి సరిగా లేదని, మత్తులో హత్యలు చేస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Advertisement

Next Story