ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరాల పంపిణీ

by Shyam |
ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్ హాల్లో సీపీ అంజనీకుమార్ చేతులమీదుగా బుధవారం ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ,నోవెల్ కరోనా వైరస్
(కొవిడ్ 19) నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసం పోలీసులు భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. లాక్ డౌన్ విధించిన కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు.

సిటీ పోలీసుల ఆధ్వర్యంలో గత 5 వారాలుగా ప్రజలకు రక్షణ కల్పిస్తూ, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం 60 మంది ట్రాన్స్‌జెండర్లకు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలతో పాటు శానిటైజర్లు, మాస్కులను సీపీ అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు, ఇన్‌స్పెక్టర్లు కళింగరావు, సత్తయ్య పాల్గొన్నారు.

Tags: transgenders, masks, sanitisers, police dept, distribution, essential commodities,

Advertisement

Next Story

Most Viewed