- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష
దిశ, ఏపీ బ్యూరో : గోవు సర్వదేవతల స్వరూపమని… గోవును ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆవును గోమాతగా పిలుస్తారు. భారతీయ సనాతన సంప్రదాయంలో గోవు పరమ పూజనీయమైనది. అలాంటి గోమాతలు నేడు మృత్యువుతో పోరాడుతున్నాయి. తీరని బాధలతో గోమాత అంబా.. అని అరచినా కనీసం కనికరించే నాదుడే కరువవ్వడంతో చివరకు గోమాతలు బతకలేక.. చావుకేక పెడుతున్నాయి. దాణా లేక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నాయి. ఈ విషాద ఘటన విశాఖజిల్లా వెంకోజిపాలెం జ్ఞానానంద ఆశ్రమంలో చోటు చేసుకుంది.
జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల బాధ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు25గోవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని గోవులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలివస్తున్న 160 గోవులను పోలీసులు పట్టుకుని జ్ఞానానంద ఆశ్రమంలో వదిలేసి వెళ్లారు. కేవలం 20 ఆవులకే నివాసం ఉన్న ఆశ్రమంలోకి 160 కొత్త ఆవులు రావడంతో ప్లేస్ సరిపోలేదు. అంతేకాదు దాణా, నీరు కూడా కరువైంది. పశుగ్రాసం, నీళ్లు లేక డొక్కలు ఎండిపోయి మృత్యువాతపడుతున్నాయి. శుక్రవారం 13 గోవులు మృతిచెందితే.. శనివారం మరో 8 ఆవులు మృతిచెందాయి. ఆదివారం ఉదయం మరో నాలుగు గోవులు మరణించాయి. దీంతో మొత్తం 25 ఆవులు మృతిచెందాయి.
మరికొన్ని దాణా, నీరు లేక కోమాలోకి వెళుతున్నాయి. పశు సంవర్ధశాఖ అధికారులు ఆశ్రమానికి చేరుకొని, అనారోగ్యంగా ఉన్న ఆవులను పరీక్షించి మందులు వేశారు. సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఆదివారం పలువురు జనసేన నేతలు గోశాలను సందర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే గోవులు మరణిస్తున్నాయని కనీసం మూగజీవాలకు దాణా కూడా పంపిణీ చేయలేని దుస్థితిలో ఉందంటూ మండిపడ్డారు.