అన్నం పెట్టేవాడు పోయాడని.. మూగజీవుల రోదన

by Sridhar Babu |   ( Updated:2020-08-25 11:57:02.0  )
అన్నం పెట్టేవాడు పోయాడని.. మూగజీవుల రోదన
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మన జీవితాల్లో భాగమయ్యాక అయినా వారే దూరమవుతున్న రోజులివి. ఒకవేళ వైరస్‌ బారిన పడి చనిపోతే కట్టుకున్న భార్య, కనిపెంచిన కొడుకులు, బిడ్డల కడసారి చూపునకు కూడా వారు నోచుకోవడం లేదు. బంధువులేమో తమకు బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తమకు రోజు అన్నం పెట్టిన వాడు మరణించడంతో ఆ మూగజీవుల రోదన అందరి కంట కన్నీరు పెట్టించింది.

వివరాల్లోకివెళితే.. రిటైర్డ్ జవాన్ తాడి మనోహర్ గుండె పోటుతో ఇవాళ మరణించాడు. దీంతో ఆయన మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే సమయంలో రెండు ఆవులు, ఓ దూడ అక్కడికి వచ్చాయి. మనోహర్ మృతదేహంపై తల పెట్టి కాసేపు అలానే ఉండి పోయింది ఓ దూడ. మరో ఆవు మనోహర్ కాళ్లను నాలుకతో స్పృసిస్తూ దీనంగా నిలుచుండిపోయింది.

రోజు తమకు తిండి పెట్టాడన్నా విశ్వాసాన్ని ఆ మూగజీవులు ఈ విధంగా ప్రదర్శించాయి. అయితే, మనోహర్ తన ఇంటి పరిసరాల్లో తిరిగే ఆవుకు అరటి పండ్లు, మేత వేసేవాడు. అలాంటి వ్యక్తి మంగళవారం విగతజీవిగా కనిపించే సరికి ఆవులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.

Advertisement

Next Story

Most Viewed