- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిలియన్ మార్క్ దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా నుంచి బయటపడాలంటే వ్యాక్సిన్ అందరూ తప్పని సరిగా తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను కోరాయి. కొంత మందిలో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను కూడా తొలిగించి వ్యాక్సినేషన్‌లో మైలురాయిని అధికమించింది భారత్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ బిలియన్ మార్క్ ను దాటింది. ఈమేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వంద కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ను మొదటగా చైనా అధిగమించగా.. నేడు భారత్ ఆ రికార్డు ను కైవసం చేసుకుంది.
దేశవ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవ్వగా.. టీకా కొరత కారణంగా.. 85 రోజుల్లో 10 కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఆ తర్వాత 45 రోజుల్లోనే 20కోట్లు పంపిణీ చేయగా.. 29 రోజుల్లో 30కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. అనంతరం యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయించి.. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు చేపట్టి.. కేవలం కొద్ది రోజుల్లోనే.. ఆగస్టు 6న 50 కోట్ల మైలురాయిన అధిగమించింది. ఆ తర్వాత 75 రోజుల్లోనే (అక్టోబర్21) బిలియన్ డోసులను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 7 బిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్ల పంపిణీ జరిగిందని, కేవలం ఇండియాలోనే 1 బిలియన్ పూర్తిచేయడంపై ICMR డీజీ డాక్టర్ బల్రామ్ భార్గవ హర్షం వ్యక్తం చేశారు.