జిన్నారం పీహెచ్‌సీ‌లో కోవిడ్ టెస్టులు ప్రారంభం

by Shyam |
జిన్నారం పీహెచ్‌సీ‌లో కోవిడ్ టెస్టులు ప్రారంభం
X

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు నిర్వహణ, పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత వైద్యులు తెలిపారు. కిట్స్ అందుబాటులో ఉన్నాయని రోజువారీగా టెస్టులు నిర్వహిస్తామని అన్నారు.

పాజిటివ్ వచ్చిన వారికి సరైన సూచనలు చేస్తూ మందులను అందజేస్తున్నామన్నారు. జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లిన నలుగురిని తిరిగి పంపాలని వెంకటేశం గౌడ్ డీఎంహెచ్ఓను కోరారు. అంతేగాకుండా ఈరోజు 16 కరోనా టెస్టులు నిర్వహించామని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed