- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మహమ్మారి వృద్ధి దృక్పథానికి అతిపెద్ద అవరోధం : ఆర్‌బీఐ!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్థిక వృద్ధి అంచనాను పునః సమీక్షించించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, ఆర్థికవృద్ధిని గాడిన పెట్టేందుకు విధాన పాలసీ ఉపయోగపడుతుందని ఆర్‌బీఐ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికను విడుదల చేసిన ఆర్‌బీఐ పలు అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 10.5 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
కరోనా మహమ్మారి వృద్ధి దృక్పథానికి అతిపెద్ద అవరోధం. అయినప్పటికీ ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచడం, సామర్థ్య వినియోగాన్ని పెంచడం, మూలధన వస్తువుల దిగుమతులను పెంచడం వంటి అంశాలు సానుకూలతకు అవకాశమని’ ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. విదేశీ మారక లావాదేవీలు 2019-20లో రూ. 29,993 కోట్లుగా నమోదవగా, 2020-21లో రూ. 50,629 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ప్రస్తుత సమయంలో మిగిలిన దేశాలతో కలిసి పనిచేయడం ద్వారా స్వతంత్రంగా పోరాడే దానికంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.