- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పత్రిలోనే పాజిటివ్ పేషెంట్ ఆత్మహత్య..
దిశ ప్రతినిధి, ఖమ్మం :
ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండ్రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చిన మరియమ్మ (65) అనే మహిళ ఆస్పత్రి వాష్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం సాయంకాలం చోటుచేసుకోగా స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకివెళితే .. కరోనాకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మరియమ్మ తనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిస్తే గ్రామస్థులు దూరం పెడుతారని ఆవేదనకు గురైంది. దానికితోడు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం.. వైద్యులు అందించే చికిత్స వల్ల రోగం నయం అవుతుందో లేదో అని తీవ్ర ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలోనే ఎవరూ లేని సమయం చూసి వాష్‌రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన బాధితురాలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకోవటం అందరినీ కలిచివేసింది.