- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం కోసం కరోనా పేషెంట్ పరార్..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం అన్ని దేశాలు క్వారంటైన్ సెంటర్‌లను నిర్వహిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను అందులో ఉంచి, టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, వాటిల్లో ఉండేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. చిన్న చిన్న కారణాలు వెతుకుతూ పారిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మందుకోసం న్యూజిలాండ్‌లోని క్వారంటైన్ సెంటర్ కంచెను కట్ చేసి ఓ వ్యక్తి పారిపోయాడు.
గత బుధవారం సిడ్నీ నుంచి వచ్చిన మార్టిన్ మెక్‌వికర్(52)ను హమిల్టన్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. అయితే మద్యం కోసం అతడు 1.8 మీటర్ల మేర కంచెను కట్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత దగ్గర్లోని లిక్కర్ స్టోర్ దగ్గరకు వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. దాదాపు అరగంట తరువాత ఆ వ్యక్తి తిరిగి క్వారంటైన్ సెంటర్‌కి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో.. ప్రస్తుతం పోలీసుల అదుపులో మార్టిన్ ఉన్నాడు. కాగా ,ఇప్పటివరకు అతడికి మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
కాగా, ఆ మధ్యలో కరోనాను జయించినట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అయితే, ఆ తర్వాత విదేశాల నుంచి ఆ దేశానికి ప్రయాణాలు ప్రారంభం కావడంతో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వేరే ప్రదేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశారు. అయితే, అందులో ఉన్నవారు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు ఓ వ్యక్తి క్వారంటైన్ నుంచి తప్పించుకొని షాపింగ్ చేసి వచ్చాడు. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, ఓ మహిళ సైతం క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుని చివరకు పోలీసులనే అడ్రస్ అడగడంతో వారికి చిక్కింది.