- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీకల్లోతు నష్టాల్లో కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవితాలు గడవాలన్నా కూడా కష్టంగా మారింది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసినా కూడా కూడా కొందరు వ్యాపారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. షాపులు కమర్షియల్ ఏరియాల్లో ఉండటం వల్ల భారీగా అద్దెలు చెల్లిస్తూ నానా కష్టాలు పడుతున్నారు. కంప్యూటర్ రిపేరింగ్ సెంటర్లకు వచ్చే వారు లేకపోవడంతో వ్యాపారం డీలా పడింది. ఇన్ని రోజులు మహానగరంలోని పలు ప్రాంతాల్లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్లకు వచ్చే విద్యార్థులు వస్తుండటంతో వారికి బిజినెస్ బాగానే జరిగింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇన్నిరోజులు విద్యార్థులు ఎవరూ రాలేదు. ఇప్పుడు పూర్తిగా ఎత్తేసినా కూడా బిజినెస్ జరగడంలేదంటున్నారు వ్యాపారులు. సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో పనిలేక కష్టాలు ఎదుర్కొంటున్నారు కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు.
వ్యాపారం డీలా
కరోనా విజృంభించడంతో ఇన్నిరోజులు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే ఇటీవల ఆంక్షలన్నీ తొలగించినా సాఫ్ట్ వేర్ కంపెనీలు తెరుచుకోలేదు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కు అవకాశం కల్పించడంతో వారు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్న సమయంలో వారికి రిపేర్లు ఏమైనా వస్తే అక్కడికి వెళ్లి సమస్యలుంటే పరిష్కరించేవారు. అయితే వర్క్ ఫ్రం హోం తో ఆ అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల ఆదాయాన్ని కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారు కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు. నేటికీ ఇనిస్టిట్యూట్లు కూడా తెరుచుకోకపోవడంతో నిరుద్యోగులు కూడా ఎవరూ నగరానికి చేరుకోలేదు. కాలేజీలు కూడా లేకపోవడంతో ఆ విద్యార్థులు కూడా ఎవరూ బయటకు రావడంలేదు. వారు వస్తే అయినా వారి కంప్యూటర్ల మైనర్ రిపేర్లు చేసుకుంటే తమకు కొంతైనా మిగిలేదని, ఎవరూ రాక వ్యాపారం పూర్తిగా డీలా పడినట్లు వారు చెప్పుకొచ్చారు.
అద్దె చెల్లించేందుకు కష్టాలు
మహానగరంలో అమీర్ పేట, విద్యానగర్, దిల్ సుఖ్ నగర్, నారాయణ గూడ తదితర ప్రాంతాల్లో ఇనిస్టిట్యూట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లు కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కమర్షియల్ ఏరియాల్లో ఉండటం వల్ల చిన్న గదికే భారీగా అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. నెలకు రూ.30 వేల నుంచి మొదలు రూ.80 వేల వరకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వ్యాపారం కొనసాగినా.. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తాయి. సాధారణ సమయాల్లోనే అద్దె చెల్లించేందుకు ఇబ్బందులున్నాయన్న వారు తమ భారాన్ని తగ్గించుకునేందుకు ఇతరులతో ఒప్పందం కుదుర్చుకుని ఒకే షాపులో మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ సర్వీస్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయినా బిజినెస్ లేక షేరింగ్ లో ఉన్న నగదు కూడా చెల్లించలేకున్నట్లు ఆవేదన చెందుతున్నారు.
పెరిగిన స్పేర్ పార్ట్స్ తో సతమతం
లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేక కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. డిమాండ్ కు అనుగుణంగా సప్లై లేకపోవడంతో ఇక్కడి బడా డీలర్లు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు విక్రయాలు చేపడుతున్నారు. ధరలు అమాంతం పెరగడంతో అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితుల్లో చిన్న వ్యాపారులు మొగ్గుచూపడంలేదు. ఎవరో ఒకరు కంప్యూటర్ రిపేర్ అని షాపునకు వచ్చినా కూడా ఈ పెరిగిన ధరలు చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. నిత్యావసరాల జాబితాలో కంప్యూటర్లు లేకపోవడంతో ఇవ్వాళ కాకుంటే మరోరోజైనా రిపేర్ చేయించుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఉద్యోగులు, విద్యార్థులు రిపేర్లకు ముందుకు రావడంలేదు.
కొత్త కంప్యూటర్లు కొనేవారు కరువే..
ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారు. ఆన్ లైన్ విద్య కోసం కంప్యూటర్లు తీసుకునేందుకు రేట్లు ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లు తీసుకునేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. కొంతరు తల్లిదండ్రులు కంప్యూటర్లు కొనేందుకు మొగ్గుచూపినా తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల ఒత్తడితో ఫోన్లు తీసుకోవాల్సి వస్తోంది. అలా కొత్త కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు కూడా అమ్ముడుపోవడంలేదు. సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు తక్కువ ధరలో ఉన్నా కూడా ఫోన్ కొనేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంక్కేందుకు ఫోన్ అయితే తక్కువ ధరకు వస్తుందని భావిస్తున్నారు.
15 నెలలుగా ఇబ్బందులే..
కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పదిహేను నెలలుగా నష్టాల్లో కూరుకుపోయాం. అసలే గిరాకీ లేదు. దీనికి తోడు అద్దె విపరీతంగా ఉంది. యజమానులు మా పరిస్థితిని అర్థం చేసుకొని అద్దె తగ్గించాలి. ఇప్పటికే అప్పులు తెచ్చి కిరాయి కడుతున్నాం. బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి. కుటుంబం బతికేదెలాగో అర్థం కావడం లేదు. కొత్త కంప్యూటర్లు కూడా ఎవరూ కొనడం లేదు. సెకండ్ హ్యాండ్ కు కూడా ఆదరణ లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా ఐటీ కంపెనీలు తెరుచుకోలేదు. ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పడాలో తెలియడంలేదు. -మజర్, కంప్యూటర్ షాపు నిర్వాహకుడు, అమీర్ పేట
స్పేర్ పార్ట్స్ సప్లై లేక ధరలు పెరిగిపోయాయి
కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇతర దేశాల నుంచి స్పేర్ పార్ట్స్ వస్తాయి. కరోనా కారణంగా దాదాపు ఎక్కడిక్కడ రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సప్లై లేక డిమాండ్ భారీగా ఏర్పడింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అంత మొత్తం చెల్లించి మేము కొనుగోలు చేయాలన్నాఇబ్బందిగా మారింది. ఇక రిపేరింగ్ కు వచ్చే ఒకరిద్దరు కూడా ఆ రేట్లు చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. -గండి రాము, యారో ఇన్ఫోటెక్ కంప్యూటర్ సర్వీసెస్, జనగామ జిల్లా