- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్స్‌లో బేరానికి బేడ్లు.. కోట్ల రూపాయలు దందా.!
దిశ, తెలంగాణ బ్యూరో : నిమ్స్ ఆసుపత్రిలోని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్ వ్యాధి వ్యాప్తిని ఆసరాగా చేసుకొని నిమ్స్‌లోని ఓ ఉన్నతాధికారి బెడ్ల దందాకు తెరలేపాడు. బెడ్ ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల తీసుకొని మోసం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బ్రోకర్‌పై బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రి వర్గాలు అంతర్గత విచారణ చేపట్టడంతో అసలు విషయాలు బయటపడ్డాయి.
నిమ్స్ ఆసుపత్రిలోని ఓ ఉన్నతాధికారి తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తేలింది. ఆసుపత్రి బయట బ్రోకర్లను ఏర్పాటు చేసి కొవిడ్ చికిత్సల కోసం వచ్చిన వారిని గుర్తిస్తున్నారు. బెడ్ కావాలంటే రూ.లక్షలు చెల్లిస్తే సమకూర్చుతామని దందా కొనసాగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 60 బెడ్లను డబ్బులు తీసుకొని కేటాయించినట్టుగా వెలుగులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో విచారణలు చేపడితే రూ.కోటి వరకు కొవిడ్ పేషెంట్ల నుంచి దోచుకున్నట్టుగా తేలే అవకాశమున్నట్టు ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.