పెరిగిన కొవిడ్ కేసుల రికవరీ రేటు..

by vinod kumar |
పెరిగిన కొవిడ్ కేసుల రికవరీ రేటు..
X

న్యూఢిల్లీ: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసుల రికవరీ 25.13 శాతం పెరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. గురువారం అధికారులు మీడియాతో మాట్లాడుతూ, కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారించబడిన కేసుల హాస్పిటల్ నుంచి రికవరీ 14 రోజుల కిందట 13 శాతం మాత్రమే ఉండేదనీ, ప్రస్తుతం పెరిగిందని తెలిపారు. హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొవిడ్ కేసుల వ్యాప్తి కూడా లాక్ డౌన్ వల్ల తగ్గిందని చెప్పారు.

గడిచిన 24 గంటల్లో మొత్తం 8,324 మంది పేషెంట్లు కొవిడ్ 19 నుంచి రికవరీ అయ్యారనీ, 1,718 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. మొత్తంగా ఇప్పటి వరకు 33,050 కేసులు నమోదు కాగా, ఇందులో కరోనాతో 1,074 మంది మరణించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ,కొవిడ్ పాజిటివ్ కేసుల వ్యాప్తి, నమోదు క్రమంగా తగ్గిందని తెలిపారు. కాగా, ప్రభుత్వం మే 3 తర్వాత లాక్ డౌన్పొడగించనుద్దా లేక ఆపేయనుందా తెలియాల్సి ఉంది. అయితే, కొవిడ్ పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Tags: increased, covid 19 positive cases, percentage, lockdown, extension, home ministry

Advertisement

Next Story

Most Viewed