కరోనా విజృంభన..

by vinod kumar |
కరోనా విజృంభన..
X

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 66 దేశాల్లో, 88,257మందికి సోకగా, దాదాపు మూడువేల మంది మృతిచెందారు. ఈ వైరస్‌తో ఒక్క చైనా దేశంలోనే 2,870మంది మరణించారు. చైనా తర్వాత దక్షిణకొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్‌లో ఈ వైరస్ ఎక్కువ తీవ్రత చూపుతోంది. ఆస్ర్టేలియా దేశంలోని పెర్త్‌లో తొలిమరణం నమోదు అయ్యింది. ఇరాన్‌లో దాదాపు 54కు మృతుల సంఖ్య పెరిగింది. ఇవాళ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.
వియత్నాంకు దక్షిణకొరియా నుంచి విమాన రాకపోకలు రద్దు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో వియత్నాం పౌరవిమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణకొరియా నుంచి వియత్నాం రావాలనుకునే ప్రయాణికులు, తమ ఆరోగ్య పరిస్థితిపై డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులు సూచించారు. దక్షిణకొరియా జాతీయులకు వియత్నాం దేశం వీసాలు కూడా నిలిపివేసింది.

Advertisement

Next Story