- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుగులమందు తాగి బస్సెక్కిన ప్రేమజంట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దిశ, అశ్వారావుపేట: పురుగుల మందుతాగి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చండ్రుగొండ మండలం సీతాయిగుడెం గ్రామానికి చెందిన జగ్గారావు(30), అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక(14) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు మంగళవారం అశ్వారావుపేట బస్టాండ్ లో పురుగులమందు సేవించి పాల్వంచ బస్ లోకి ఎక్కి కూర్చున్నారు. టికెట్లు ఇచ్చేందుకు వచ్చిన కండక్టర్ వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయాని గమనించి హుటాహుటిన బస్సును అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఇద్దరనీ పరిశీలించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. జగ్గారావు ఆటోడ్రైవర్ కాగా, బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. మృతులది ఇంటిపక్కపక్క ఇళ్లు కావడం గమనార్హం. చంద్రుగొండ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి వీరిద్దరిపై మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు జగ్గారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. జగ్గారావు జేబులో పసుపు తాళిబొట్టును పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.