విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి.. 2 రోజుల తర్వాత కుక్కలు అరుస్తుండడంతో గమనించిన కూలీలు

by Sumithra |   ( Updated:2021-12-19 01:29:36.0  )
Couple-died
X

దిశ, చౌట్కూర్: విద్యుత్ షాక్ తగిలి దంపతులు మృతిచెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామ శివారులో హైదరాబాద్ కి చెందిన లక్ష్మన్ రావు అనే వ్యక్తి దాదాపుగా 40 ఎకరాల భూమి కొని అక్కడ పనిచేయడానికి విశాఖపట్నం జిల్లా మదుగుల మండలం దొర్ల సురవరం గ్రామానికి చెందిన బిక్కిన శ్రీనివాసరావు, అతని భార్య దేవిలను నియమించాడు. వారు నివాసం ఉండడానికి రేకులతో ఒక ఇళ్లును ఏర్పాటు చేశాడు.

గురువారం సాయంత్రం శ్రీనివాస్ రోజు మాదిరిగానే చేనులో పని ముగించుకొని ఇంటికి వచ్చి స్నానానికి వెళ్లేందుకు ఇంటి లోపల జీఏ వైర్ తో కట్టిన బట్టల దండెం మీద ఉన్న టవల్ తీసుకుంటుండగా అప్పటికే ఇంటి బయట బల్బుకు కనెక్షన్ ఇచ్చిన వైర్ తెగి, రేకులకు సపోర్టుగా ఉన్న ఇనుప రాడ్ పై పడింది. దీంతో శ్రీనివాస్ విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అది చూసి బయట పనిచేస్తున్న శ్రీనివాస్ భార్య దేవి ప్లాస్టిక్ చెప్పుతో విద్యుత్ వైర్ ను కొట్టడానికి ముందుకు రాగా శ్రీనివాస్ చేతిలో ఉన్న వైర్ తెగి ఆమె మెడకు, కడుపుకు తగలడంతో శ్రీనివాస్ తో పాటు ఆమె కూడా అక్కడికక్కడే మృతిచెందింది.

ఈ విషయాన్ని శనివారం సాయంత్రం పక్క చేనులో పని చేసే కూలీలు కుక్కల అరుపులు విని, గ్రామ సర్పంచ్ పల్లవికి తెలియజేయగా ఆమె భర్త జయరాం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాడు. అనంతరం ఆ భూమి యజమానికి, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు.

Advertisement

Next Story