- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్‌లో కౌంటింగ్ మరింత ఆలస్యం!
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగగా.. ప్రస్తుతం బ్యాలెట్లలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నగరంలోని కొన్ని డివిజన్లు మినహా అన్ని సర్కిళ్లలో లెక్కింపు ప్రక్రియ సజావుతగా సాగుతోంది. అయితే, రాజేంద్రనగర్ సర్కిల్లోని ఐదు డివిజన్లలో మధ్యాహ్నం 12:45 కావొస్తున్న లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు.
కౌంటింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే బ్యాలెట్ బాక్సుల్లోని పేపర్లను తీసి కట్టలు కడుతున్నారు. ఈ తతంగాన్ని ఆయా పార్టీల ఏజెంట్లు బయటనుంచే నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది అవగాహనా రాహిత్యం వల్లే ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతోందని వివిధ పార్టీల ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫలితంగా రాజేంద్రనగర్, మైలార్ దేవరపల్లి, సులేమాన్ నగర్, అత్తాపూర్, శాస్త్రీపురం డివిజన్ల ఫలితాలు వెలువడేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.