- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్‌పై కార్పొరేట్ కంపెనీల ఖర్చులు ఇకపై సామాజిక బాధ్యతగా గుర్తింపు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ కట్టడి కోసం కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న ఖర్చులు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద పరిగణించబడతాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నియంత్రణ కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, వైద్య ఆక్సిజన్ ఉత్పత్తి, ప్లాంట్లను నెలకొల్పడం, ఆక్సిజన్ కాన్సంట్రేషన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఇంకా ఇతర పరికరాల తయారీతో పాటు సరఫరా వంటివన్నీ సీఎస్ఆర్ కిందకు వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది.
అలాగే, తాత్కాలిక ఆసుపత్రులు, తాత్కాలిక కరోనా సంరక్షణ సౌకర్యాల ఏర్పాట్ల కోసం చేసే ఖర్చులను కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యతగా భావించనున్నట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లాభదాయకంగా కొనసాగుతున్న కంపెనీలు ఒక నిర్దిష్ట సంవత్సరంలో సీఎస్ఆర్ పనుల కోసం మూడేళ్ల వార్షిక సగటు నికర లాభంలో కనీసం 2 శాతం వినియోగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అలాగే, షరతులకు లోబడి ప్రభుత్వ సంస్థలతో సహా ఏవైనా కంపెనీలు సీఎస్ఆర్ నిధులను ఉపయోగించి ప్రత్యక్షంగా లేదా సహకారంతో, ఇతర సంస్థల భాగస్వామ్యం ద్వారా కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపట్టవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.