- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Helicopter Crash: ఈ బోల్ట్ కారణంగానే హెలికాప్టర్ క్రాష్ అయిందా? బయట పడ్డ సంచలన నిజాలు

దిశ, వెబ్ డెస్క్: Helicopter Crash: రెండు రోజుల క్రితం న్యూయార్క్ లో నదిలో ఓ హెలికాప్టర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం మరణించింది. అయితే ఈ కుటుంబం మరణానికి ఒక నట్టు కారణమైనట్లు నిపుణులు భావిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ న్యూయార్క్ లోని హడ్సన్ నదిలో కూలింది. హెలికాప్టర్ రెక్కలు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే హెలికాప్టర్ వెనక జీసెస్ నట్టుగా వ్యవహరించే ఓ కీలక భాగం ఊడిపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
హెలికాప్టర్ కు ఉండే రూటర్ ను దాని మాస్ట్ కు అనుసంధానించి ఉంచే అత్యంత కీలకమైన ఓ నట్టు ఉంటుంది. దీనిని జీసస్ నట్టుగా వ్యవహరిస్తుంటారు. వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా సైనికులు తొలిసారిగా ఈ పదాన్ని వాడారు. అప్పట్లో హెలికాప్టర్ లో పెద్ద సంఖ్యలో దీన్ని వినియోగించారు. అయితే అగస్టిన్ కుటుంబం ఎక్కిన హెలికాప్టర్ గాలిలో ఉన్న సమయంలోనే ఇది ఊడిపోయి ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రూటర్ ఊడిపోయింది. దాని బ్లేడ్లు వేగంగా గాల్లో తిరుగుతూ నీటిలో పడిన ద్రుశ్యాలు వైరల్ అయ్యాయి. నిబంధనల ప్రకారం హెలికాప్టర్ గాల్లో ఎగిరే ప్రతిసారి ఆ నెట్టును చెక్ చేయాలి. కానీ ఈ ప్రయాణానికి ముందు ఆ చెకింగ్ జరగలేదని సమాచారం.
ఇక ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో చాలా రిపేర్స్ ఉన్నట్లు గుర్తించారు. గత ఏడాది దీనిలో ట్రాన్స్ మిషన్ సమస్య వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు అంటున్నారు. దాదాపు 12వేల గంటల గగనతల యాత్రలు చేసింది. ఈ నేపథ్యంలో పలు మరమ్మతులు చేయాల్సి ఉంది. మార్చి 1వ తేదీన ఇది ఇన్ స్పెక్షన్ ను పూర్తి చేసుకుంది. ఇక ప్రమాదానికి గురైన రోజు వరుసగా అది 8 సార్లు గాల్లోకి ఎగిరినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫ్లైట్ రికార్డులు కూడా లేవని అధికారులు ధ్రువీకరించినట్లు న్యూయార్క్ పోస్టు కథనంలో పేర్కొంది.