- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Suriya: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. దారుణం అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) గత ఏడాది ‘కంగువ’ సినిమాతో వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే సూర్య హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య ‘రెట్రో’(Retro) చిత్రంలో నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమాను స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తు్న్నారు. అయితే ఇందులో సూర్య సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఫుల్ అయిపోయిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. జేఆర్‌సి కన్వెన్షన్ హాల్‌లో ఏప్రిల్ 26న జరగబోతున్న ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నీ ‘కంగువ’ సినిమా చూసిన కూడా ఇంత బాధ పడలేదు అన్నా మరెవ్వరూ దొరకలేదా అథిదిగా తీసుకురావడానికి? దారుణం అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అంత పెద్ద స్టార్ అయి ఉండి ఆయనని పిలవడం ఏంటి? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, సూర్య- వెంకీ అట్లూరి కాంబోలో కూడా ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న.. ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్.