- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రి కొత్తగూడెంలో ‘కమర్షియల్’ అధికారుల కక్కుర్తి ..!
దిశ ప్రతినిధి, ఖమ్మం: వివిధ వర్గాలనుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పన్నులు చెల్లించడానికి కీలక పాత్ర పోషించాల్సిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. అక్కడ పనిచేసే అధికారులు మొదలు అంటెడర్ల వరకు అందరూ తమ విధుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఖజానాను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు దొంగబిల్లులతో ప్రభుత్వ సొమ్మునే కాజేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీటీవో ఆఫీసుల్లో జరుగుతున్న తంతు అంతా ఇంతా కాదు. జిల్లా కేంద్రంలో ఒక బిల్డింగులోనే రెండు విభాగాలుగా సీటీవో-1, సీటీవో-2గా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. మిగతా అవినీతి ఎలా ఉన్నా.. ఏకంగా హైర్(అద్దె) కార్ల పేరిట ప్రభుత్వానికే కొన్నేళ్లుగా పంగనామం పెడుతున్నారు. లేనివి ఉన్నట్లు చూపుతూ నెలకు లక్షల్లో బిల్లులు డ్రా చేస్తూ పంచుకుతింటున్నారు. ఈ తతంగం అంతా అందులో పనిచేసే అటెండర్లు నడిపిస్తున్నా.. అధికారులదే ప్రధాన పాత్ర.
ఉన్నది ఒక్క కారే..
వాస్తవానికి కమర్షియల్ అధికారులు రెండు ఆఫీసులకు గాను ఒక అద్దె కారునే మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి మాత్రం ఐదు హైర్ కార్లు వినియోగిస్తున్నట్లు లెక్కల్లో చూపుతో బిల్లులు డ్రా చేస్తున్నారు. ఒక్క కారుకు నెలకు రూ.33వేల చొప్పున ఐదు కార్లకు రూ. 1లక్షా 65 వేల బిల్లులు అంటూ డ్రా చేస్తుండడం గమనార్హం. ఇలా ఏకంగా 2017 నుంచి అధికారులు ఇలా బిల్లులు పెడుతున్నట్లు సమాచారం. వచ్చిన డబ్బులను అందరూ వాటాలుగా పంచుకుంటున్నట్లు ఆ తంతు అందరికీ తెలిసినా ఎవరికి వారే మిన్నకుండటం గమనార్హం. మొత్తానికి సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి లక్షల్లో సొమ్ము కాజేశారనే ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల హోదాను బట్టి హైర్ కార్లను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంటుంది. అయితే ఇలా అద్దెకార్లను వినియోగించాలంటే నిబంధనల ప్రకారం టెండర్ల ద్వారానో, నోటిఫికేషన్ల ద్వారానో పిలవాల్సి ఉంటుంది. వచ్చిన వారిలో తక్కువకు ఖర్చయ్యే వారి కార్లను మాత్రమే వినియోగించాలి. కానీ ఇక్కడ మాత్రం అవేమీ జరగలేదు. నిబంధనలకు విరుద్ధంగానే ఉన్న ఒక్క అద్దె కారును కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. మిగతా నాలుగు కార్లను వినియోగించకున్నా.. తమ శాఖకు మాత్రం ఉపయోగిస్తున్నట్లు లెక్కల్లో చూపి నెలనెలా బిల్లులు కాజేస్తున్నారు.
అక్కడంతా వారిదే హవా..
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో పూర్తిగా అవినీతి రాజ్యమేలుతున్నట్లు సమాచారం. అధికారులు పైకి సైలెంట్‌గా ఉన్నా అక్కడ ‘అన్నీ’ అంటెడర్లే చూసుకుంటారు. ఈ దొంగబిల్లుల వ్యవహారంలో కూడా వారే అన్నీ చేస్తున్నట్లు సమాచారం. అధికారులకు అన్నీ దగ్గరుండి చూసుకోవడం మొదలు.. ఆఫీసు విషయాలు, పన్ను చెల్లింపుదారులనుంచి సెటిల్మెంట్లు.. ఇలా అన్నీ నడిపించేది అటెండర్లే అన్న టాక్ వినిపిస్తోంది.