- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ ఏసీబీ వలలో అవినీతి అధికారులు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నకిలీ ఏసీబీ అధికారుల భాగోతం వెలుగుచూసింది. సూర్య నటించిన ‘గ్యాంగ్’ సినిమా చూసిన ఓ ముఠా అదే తరహాలో ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. ఇదే ముసుగులో మొత్తం 68 మంది అధికారులను బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని.. అవినీతి అధికారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.
కాగా, ఇప్పటికే ముఠాను పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు. అయితే, కర్నూలు జిల్లాలో 16 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ శ్రీనాథ్ రెడ్డి నకిలీ ఏసీబీ అధికారుల వ్యవహారంలో కీలక సూత్రదారి అని తెలుస్తోంది. స్నాచింగ్ కేసులోనే జైలుకెళ్లిన శ్రీ నాథ్ రెడ్డి.. అక్కడే ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. ఎలాగైనా సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో మొత్తం 68 అవినీతి అధికారుల లీస్ట్ తయారు చేసుకొని.. గ్యాంగ్ సినిమా తరహాలో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు.
నకిలీ ఏసీబీ అధికారుల వ్యవహారం కాస్తా.. రియల్ ఏసీబీకి తెలియడంతో.. మొత్తం 13 మంది అధికారుల కార్యాలయాల్లో దాడులు చేశారు. 13 మందికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించగా.. అందులో నలుగురు నకీలీ ముఠాకు డబ్బులు ఇచ్చినట్లు వెల్లడైంది. నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు ప్రభుత్వ అధికారులు నకిలీ ఏసీబీకి నగదు బదిలీ చేసినట్లు గుర్తించి విచారణ చేపట్టారు.