- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మథన పెడుతున్న మహమ్మారి
దిశ, కరీంనగర్: కరోనా మహమ్మారి కొత్త పుంతలు తొక్కుతోంది. నిపుణుల అంచనాలను తలకిందులు చేస్తోంది. 14 రోజుల క్వారంటైన్ సరిపోతుందా అన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నా.. రోజులు గడుస్తున్నా కొద్ది సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అనుమానితులను 14రోజుల పాటు క్వారంటైన్‌లో మరో 14రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 28రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న వారికి కూడా పాజిటివ్ రావడం సంచలనం కల్గిస్తోంది.
కరీంనగర్‌కు చెందిన ఒకరు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. అతనిలో కోవిడ్ 19లక్షణాలు లేకున్నా ముందు జాగ్రత్తగా 14రోజుల పాటు గవర్నమెంట్ క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తర్వాత 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచారు. గవర్నమెంట్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు రెండుసార్లు పరీక్షించగా అతనికి నెగిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్ ముగిసిన తర్వాత మరోసారి టెస్ట్ చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో అధికారులు అతన్ని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించి అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు జిల్లా అధికారులు. మర్కజ్ ప్రార్థనలు గడిచిన 29రోజులకు అతనికి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. దీంతో డబుల్ క్వారంటైన్ ముగిసే సమయంలో కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.
గుంటూరు టు జగిత్యాల
ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా జగిత్యాల జిల్లాలో వచ్చిన పాజిటివ్ కేసు కలకలం సృష్టిస్తోంది. జగిత్యాల మండలానికి చెందిన ఐదేళ్ల బాలునికి పాజిటివ్ రావడం గమనార్హం. ఈ బాలుడు స్పీచ్ థెరపీ కోసం 40రోజుల క్రితం గుంటూరు వెళ్లి రాగా అతనితో పాటు వెళ్లిన తాతను పరీక్షించిన వైద్యులు ఇద్దరి నమూనాలను కూడా కరోనా టెస్ట్ కోసం పంపించారు. స్పీచ్ థెరఫీ చేయించుకున్న బాలునికి పాజిటివ్ రాగా తాతకు నెగిటివ్ వచ్చింది. దీంతో బాలున్ని హైదరాబాద్ తరలించి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.
అయితే బాలునికి వ్యాధి ఎలా సోకిందన్నది అంతు చిక్కడం లేదు. 40 రోజులకు పైగా గుంటూరు జిల్లా కేంద్రంలోనే ఉన్న బాలునిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడం ఓ కారణం అయితే ఆస్పత్రి నుండి అంబులెన్స్‌లో నేరుగా జగిత్యాలకు వచ్చిన ఇతనికి ఎలా సోకిందో అర్థం కావడం లేదు. పెషెంట్‌గా గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఐదేళ్ల బాలునికి సోకడం, అటెండెంట్‌గా వెళ్లిన తాతకు నెగిటివ్ రావడం విచిత్రం. బాలునికి ఆస్పత్రిలోనే కరోనా సోకిందా లేక అంబులెన్స్‌లో వస్తుండగా సోకిందా అన్న విషయం తేలాల్సి ఉంది.
Tags: Corona Virus, Positive, Quarantine, Guntur, Jagitalia, 5Years Boy, Speech Therapy, Hyderabad, Karimnagar