ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. 4,616 మంది మృతి

by vinod kumar |   ( Updated:2020-03-12 01:33:52.0  )
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. 4,616 మంది మృతి
X

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ కోవిడ్-19(కరోనావైరస్) అంటే వణికిపోతున్నాయి. రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తూ మరణాల సంఖ్యతో పాటు బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ 122దేశాలకు పాకి కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 4,616 మంది కరోనాతో మృతిచెందంగా, 1,26,061 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 5,944 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. కాగా బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రికీ ఈ వైరస్ సోకడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆయనతో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఇప్పటివరకూ చైనాలో 3,158 మంది చనిపోగా, ఇరాన్‌లో నిన్న ఒక్కరోజే 63మంది మృతిచెందారు. దీంతో ఇరాన్‌‌లో మొత్తంగా 354కి మృతుల సంఖ్య చేరింది. ఇటలీలో 631 మంది మరణించారు. దక్షిణకొరియాలో 61, స్పెయిన్‌లో 47, అమెరికాలో 31 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ప్రపంచ దేశాలు ఈ వైరస్ పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు వీసాలు రద్దు చేశాయి. మరికొన్ని దేశాలు విమాన సర్వీసులు నిలిపివేశాయి.

tags : Coronavirus, world, disease, flight services ban, hollywood hero tom hanks, britain health minister, italy, iran, india

Advertisement

Next Story

Most Viewed