- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
35,654 మందికి కరోనా స్క్రీనింగ్.. 7 అనుమానితులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు అలర్ట్ అయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి ఇప్పటివరకు 35,654 మందిని స్క్రీనింగ్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్(ఏహెచ్‌ఓ) వర్గాలు తెలిపాయి. ఏడుగురు అనుమానితులను గుర్తించిన సిబ్బంది గాంధీ హాస్పిటల్‌కు సిఫారసు చేశారు. ‘విమానాశ్రయంలో ఫిబ్రవరి 18న కరోనా స్క్రీనింగ్ పరీక్షలు మొదలు పెట్టాం. తొలుత ఆ వ్యాధి పీడితులు ఎక్కువగా ఉన్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకే పరీక్షలు జరిపాం. మార్చి 3 నుంచి ఏ దేశం నుంచి వచ్చినా కరోనా స్క్రీనింగ్ జరుపుతున్నాం’ అని ఏహెచ్‌ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మెడొజు తెలిపారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రయాణికులకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఏహెచ్‌ఓ బృందం అక్కడ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు జరపడం లేదు. ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి కరోనా పీడిత దేశాలకు విమానాల రాకపోకలు లేకపోవు. అందుకే, కరోనా స్క్రీనింగ్ జరపడం లేదని తెలిసింది. శంషాబాద్ విమానాశ్రయంలో రోజుకు 5 నుంచి 6 వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ జరుపుతున్నారు. అనుమానితులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు వెలుగు చూడటంతో తాము కూడా అలర్ట్ అయ్యామని, ఏదిఏమైనా తెలంగాణలో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జీ శ్రీనివాస్‌రావు తెలిపారు.
Tags: