- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షీణించిన ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ నుంచి ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు ఈ పీరియడ్‌లో 57.52 శాతం క్షీణించినట్టు దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ ఆదివారం వెల్లడించింది. గతేడాది 3,65,247 యూనిట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి భాగంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 1,55,156 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 64.93 శాతం తగ్గాయి. యుటిలిటీ వాహనాల ఎగుమతులు 29.67 శాతం క్షీణించాయి. సరుకుల వ్యాన్‌ల ఎగుమతులు 80.91 శాతం తగ్గిపోయాయి. ప్యాసింజర్ కార్ల ఎగుమతులు గతేడాది 2,86,618 యూనిట్ల నుంచి 1,00,529 యూనిట్లు ఉండగా, యుటిలిటీ వాహనాల ఎగుమతులు గతేడాది 77,309 యూనిట్ల నుంచి 54,375 యూనిట్లకు పడిపోయాయి. వ్యాన్ ఎగుమతులు గతేడాది 1,320 జరగ్గా, ఈసారి 252 యూనిట్లకు తగ్గిపోయాయి.
‘అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి కారణంగా ఎగుమతులు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్లాంట్లు, డీలర్‌షిప్‌లు మూతబడటం, సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ పరిస్థితులు ఉండటంతో ఎగుమతులు తీర్వంగా దెబ్బతిన్నాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. గత కొన్నాళ్లుగా లాక్‌డౌన్ సడలింపులు అమలవుతుండటంతో ఎగుమతులు మెరుగుపడ్డాయని, ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఎగుమతులు ఇదివరకటి నెలల కంటే ఎక్కువగా ఉంటాయనే నమ్మకముందని రాజేష్ మీనన్ తెలిపారు.