గోవా వెళ్లొచ్చా? నెటిజన్ల సెర్చ్

by Shyam |
గోవా వెళ్లొచ్చా? నెటిజన్ల సెర్చ్
X

కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దాదాపు అన్ని దేశాలు హై అలర్ట్ ప్రకటించడంతోపాటు ప్రజలను బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నాయి. చాలామంది ప్రజలు తమ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. కొంతమంది పెళ్లిళ్లను కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. స్కూళ్లు, షాపింగ్ మాల్స్, వ్యాయామ శాలలు, సినిమా థియేటర్లు, షూటింగ్స్.. ఇలా అన్నింటినీ ప్రభుత్వం బంద్ కూడా చేయించింది. కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అనుమతించాయి. ఇలాంటి విపత్కర సమయాల్లో గోవా ప్రయాణం శ్రేయస్కరమేనా? అంటూ కొందరూ గూగుల్‌లో వెతకటం గమనార్హం.
కరోనా మహమ్మారికి భయపడి ఇప్పటికే రైళ్లు రద్దయ్యాయి. విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఆలయాలు మూసివేశారు. పరీక్షలు వాయిదా పడ్డాయి. పర్యాటక ప్రదేశాలను కూడా మూసివేస్తున్నారు. గోవా ప్రభుత్వం కూడా మార్చి 15 నుంచి తమ రాష్ర్టానికి సందర్శకులను రావొద్దని తెలిపింది. ఇలాంటి ఆపద సమయంలో కొందరు భారతీయులు గోవా పర్యటనపై కరోనా ప్రభావం ఉంటుందా? అని వెతికనట్లు గూగుల్ ట్రెండ్స్ తెలుపుతోంది. దానికి గూగుల్ .. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయాలని, లేకుంటే ఇంటికి పరిమితం కావాలని సమాధానమిచ్చింది.

Tags: goa, trip, journey, holiday, visit, vacation, tour, google trends, corona virus,

Advertisement

Next Story

Most Viewed