- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వేళ.. ఇంట్లో ఉండాల్సిన డివైజ్‌లు
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే 8 లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తెచ్చే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికైతే.. రెండు, మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దాటుకుని.. మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ అవి వచ్చాక ఫలితం ఎలా ఉంటుందన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ వైరస్ అంతమైనా, మరికొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితిలోనే ఉండక తప్పదు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లూహెచ్‌వో) ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. పైగా కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇంకా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఇంట్లో తప్పనిసరిగా ఈ ఐదు పరికరాలను ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్..
అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా మనమంతా ఫేజ్ 3లోకి ఎంటర్ అయ్యాం. మెల్లిమెల్లిగా ప్రజలంతా మళ్లీ నార్మల్ లైఫ్‌కు అలవాటు పడుతున్నారు. పొట్ట కూటి కోసం తప్పక బయటకెళ్తున్నా.. లోలోపల మాత్రం భయపడుతూనే ఉన్నారు. ప్రస్తుత వర్షాకాలంతో పాటు రాబోయే చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణం. కానీ కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదు. అందువల్ల, కాస్త జ్వరం వచ్చినా.. జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే ఇన్‌ఫ్రారెడ్ థర్మో మీటర్‌ను వాడటం ఉత్తమం. దీని వల్ల మన టెంపరేచర్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయొచ్చు.
పల్స్ ఆక్సిమీటర్..
కృత్రిమ శ్వాస ఎవరికి అవసరం అవుతుందో గుర్తించడంలో ‘పల్స్ ఆక్సిమీటర్’ కీలకంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో ఉండే కరోనా బాధితులు.. ‘పల్స్ ఆక్సిమీటర్లు’ ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పల్స్ ఆక్సిమీటర్.. క్లిప్‌లా ఉంటుంది. ఈ పరికరాన్ని ఎక్కువగా చూపుడు వేలికి అమరుస్తుంటారు. మన శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను గుండె ఎలా సరఫరా చేస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న కరోనా రోగుల దగ్గర ఈ పరికరం ఉంటే సరిపోతుందని యేల్ వర్సిటీకి చెందిన ఊపిరితిత్తుల నిపుణురాలు డెనీస్ లచ్‌మాన్‌సింగ్ కూడా ఓ సందర్భంలో తెలిపారు. దీనివల్ల మన శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని ఆమె వెల్లడించారు. కరోనా అనుమానంతో ఉన్నవాళ్లతో పాటు, కరోనా బాధితులు, ఇతరులు వీటిని కొనుగోలు చేయడం బెటర్.
ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రే..
ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతుంటారు. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులే కాకుండా.. హౌజ్ హెల్ప్, ఎలక్ట్రీషియన్స్, డెలివరీ బాయ్స్, గ్రాసరీ బాయ్స్ ఇలా ఇంటికి వచ్చే వారి జాబితా చాలా పెద్దదే. ఎవరూ రాకపోయినా.. ఇంట్లోని వ్యక్తులే బయటకు వెళతారు. కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోకుండా ఇంట్లోకి వస్తుంటారు. ఇలాంటి అజాగ్రత్తల వల్లే.. కరోనా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఇంటి డోర్ దగ్గర ఆటోమేటిక్ శానిటైజర్ ఏర్పాటు చేస్తే.. ఇంట్లోకి ఎవరు వచ్చినా, శానిటైజ్ చేసుకుని లోపలకు రావడం వల్ల కొంతవరకు వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు.
వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ డిస్‌ఇన్ఫెక్ట్ :
ప్రతిరోజు కాకపోయినా.. వారానికి సరిపడా కూరగాయాలు తెచ్చుకున్నా సరే, వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేయడం చాలా ముఖ్యం. పండ్లను కూడా శానిటైజ్ చేయాలి. జెర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు పండ్లు, కూరగాయాల మీదున్న రసాయనిక పదార్థాలు పోవాలంటే వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. డిస్‌ఇన్ఫెక్ట్ డివైజ్ ఆ పనిని సమర్థవంతంగా చేస్తుంది. కెమికల్ ఫ్రీ ఓజోన్ టెక్నాలజీని వినియోగించి పండ్లను, కూరగాయాలను శుభ్రంగా కడిగేస్తుంది.
యూవీ లైట్ శానిటైజింగ్ బాక్స్..
గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ డివైజ్‌లపై కొన్ని కోట్ల క్రిములుంటాయి. వైరస్‌ను కూడా త్వరగా స్ప్రెడ్ చేస్తాయి. అందువల్ల వీటిని శానిటైజ్ చేయడం చాలా అవసరం. యూవీ లైట్ శానిటైజింగ్ బాక్స్‌లో మీ డివైజ్‌లను పెడితే.. ఆ డివైజ్ మీదున్న జెర్మ్స్, వైరస్, పాథోజెన్స్ అన్నీ కూడా చనిపోతాయి.