- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిర్చి రైతుకు కరోనా ఘాటు..?
దిశ, వరంగల్: కరోనా వైరస్ దెబ్బకు మిర్చి రైతుకు కష్టాలు తప్పడం లేదు. ఈ సారి మిర్చి పంట సాగు చేసిన రైతుకు ఆశించిన మేర దిగుబడి వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర సైతం లభించడంతో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే క్రమంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్ర, రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించగా మార్కెట్లు మూసేశారు. దళారుల చేతిలో మోసపోయే ప్రమాదాన్ని గ్రహించిన ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు మిర్చిని కోల్డ్ స్టోరేజీలో భద్ర పరుచుకోవాలని సూచించి.. పంట విలువ బట్టి రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణసాయం చేస్తోంది. దీంతో రైతులు పంటలను వరంగల్ కోల్డ్‌స్టోరేజీకి తరలిస్తున్నారు. కానీ సామర్థ్యం మేరకు కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మహబూబాబాద్‌లో అత్యధిక సాగు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 67,727 ఎకరాల్లో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 28, 120 ఎకరాల్లో సాగైంది. అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 515 ఎకరాల్లో సాగు చేశారు. మార్చి నుంచి వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి కొనుగోల్లు ప్రారంభమయ్యాయి. మిర్చి ధరలు కూడా గరిష్ఠంగా రూ. 21 వేల పైనే పలుకుతుండగా కనిష్టంగా రూ.13వేలు నిర్ణయించారు. దీంతో మెజార్టీ రైతాంగం మిర్చిని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే కరోనా వైరస్ కారణంగా మార్కెట్ యార్డ్ మాతపడటం రైతులను నిరాశకు గురి చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులు మిర్చిని నిల్వ చేసుకుంటున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలో మొత్తం 25కోల్డ్ స్టోరేజీలు ఉండగా, 75 శాతానికి పైగా కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయి.
రైతు బంధు ఊరటనిచ్చేనా..?
పంటను నిల్వ చేసుకునే అన్నదాతలకు రైతుబంధు పథకం కింద పంట విలువలో 75 శాతం రూ. 2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది. ఈ రుణానికి ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా చర్యలు చేపట్టింది. దీంతో పెద్ద మొత్తంలో రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సారి దిగుబడి ఎక్కువ రావడం, కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం సరిపోని కారణంగా కొంతమంది రైతులు ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో మిర్చి రంగు మారడం, నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. ఆరు నెలల తర్వాత గిట్టుబాటు ధర దక్కకుంటే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
tags: Warangal, Mirchi Farmers, Coronavirus, Cold Storage, Lockdown, Farmer, Mahabubabad