- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచదేశాల్లో కరోనా విలయం
న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రతీ దేశం ఎదుర్కుంటున్న సమస్య కరోనా. ప్రపంచానికే పెను విపత్తులా మారిన ఈ కోవిడ్-19 కారణంగా అగ్రదేశం అమెరికా సహా అన్ని దేశాలు విలవిల్లాడుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ యూరప్‌ను అతలాకుతలం చేసింది. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు కూడా వ్యాపించి మానవుని మనుగడను ప్రశ్నార్థకం చేసింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు దేశాల్లోని పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసింది.
– బ్రిటన్‌లో ఆదివారం నాటికి 657 మంది కరోనా కారణంగా మరణించారని.. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 10,612కు చేరాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన 84,279 మంది పడినట్లు నిర్థారణ కాగా, ఆదివారం నాడే కొత్తగా 5,288 మంది వైరస్ సోకినట్లు గుర్తించారు. కొత్తగా వైరస్ బారిన పడే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. మరణాల సంఖ్య తగ్గడం అక్కడ ఊరట కలిగించే విషయం.
– చైనా తర్వాత వెంటనే కరోనా బారిన పడిన దేశం ఇటలీ. చైనాకు, ఇటలీకి మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉండటంతో ఆ దేశాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇటలీ తొలి నాళ్లలో నిర్లక్ష్యం వహించడంతో అక్కడ భారీగా మృతుల సంఖ్య పెరిగింది. ఇటలీలో ఇప్పటి వరకు 1,02,253 మంది కరోనా బారిన పడగా వారిలో 19,899 మంది మృతి చెందారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.
– యూరప్‌లో మరో దేశమైన స్పెయిన్‌లో మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రతీ రోజు మరణాల సంఖ్య తగ్గుతుండటంతో అక్కడి ప్రభుత్వానికి కాస్త ఊరట లభించినట్లైంది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో 1,66,019 మందికి కరోనా సోకగా 16,972 మంది మరణించారు. కాగా, కరోనాపై మనం మరింత కాలం పోరాటం చేయాలని.. లాక్‌డౌన్ నిబంధనలు ప్రజలందరూ పాటించాలని ప్రధాని పెడ్రో శాంఛెజ్ విజ్ఞప్తి చేశారు.
– ఇక ఆసియా దేశమైన సింగపూర్‌లో సోమవారం కొత్తగా 233 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా వీరిలో 59 మంది భారతీయులు ఉన్నారు. వీరందరూ సింగపూర్‌లో ఉపాధి కోసం వెళ్లిన వారేనని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్‌లో మొత్త 2,532 మంది కరోనా బారిన పడగా.. చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు పెట్టడంతో కేవలం నిత్యావసరాలకు మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 18,50,220 మంది కరోనా బారిన పడగా 1,14,215 మంది మృతి చెందారు. ఇక 4,30, 445 మంది కోవిడ్ – 19 నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
tags:coronavirus, world, across globe, covid 19, deaths, cases