- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
18 రోజులు.. 22 వేల కేసులు
దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. 69 రోజుల్లోనే ఐదు వేల మార్కు చేరుకుంది. మొత్తం 430 జిల్లాలకు పాకింది. ఈ నెల 8వ తేదీ నాటికి 5,194 ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య గడచిన 18 రోజుల్లో 26,917కు చేరుకుంది. 18 రోజుల్లోనే దాదాపు 22 వేల కేసులు పెరిగాయి. తొలుత ప్రతీ ఐదువేల కేసుల చొప్పున పెరగడానికి ఆరున్నర రోజులు పడితే, ఇప్పుడు రెండున్నర రోజులు పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘డబ్లింగ్’ను పరిగణనలోకి తీసుకుంటూ పదిరోజుల వ్యవధి పడుతోందని సంతృప్తి వ్యక్తం చేస్తోంది. కానీ, రికార్డులను అధిగమిస్తూ ఒక్కరోజు వ్యవధిలోనే 1,975 కేసులు ఆదివారం నమోదయ్యాయి.
తెలంగాణలో సైతం వెయ్యి మార్కు…
తెలంగాణలో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటినట్లయింది. ఇందులో ఐదు రాష్ట్రాల్లో రెండు వేలకంటే ఎక్కువ కేసులే నమోదయ్యాయి. మహారాష్ట్రలో రెండు వేల మార్కు చేరుకోడానికి 37 రోజులు (ఏప్రిల్ 14 న) పడితే గుజరాత్‌లో మాత్రం 33 రోజుల్లోనే (ఏప్రిల్ 21న) రెండువేల మార్కు దాటింది. మధ్యప్రదేశ్‌లో 37వ రోజున(ఏప్రిల్ 26), రాజస్థాన్‌లో 54వ రోజున (ఏప్రిల్ 25), ఢిల్లీలో 50వ రోజున (ఏప్రిల్ 20)న రెండువేలకు మించి కేసులు నమోదుయ్యాయి. దేశవ్యాప్తంగా రోజూ సగటున 45 మంది చొప్పున చనిపోతున్నారు.
గత ఆరు రోజుల్లో 267 మంది మృతి…
గత ఆరు రోజుల్లో 267 మంది కరోనా కారణంగా చనిపోయారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చేనాటికి కేవలం పది మంది చనిపోతే ఇప్పుడు మృతుల సంఖ్య 826కు చేరుకుంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల టెస్టుల సంఖ్య పెరుగుతున్నాకొద్దీ పాజిటివ్ కేసులు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగైదు రాష్ట్రాల్లో రోజూ వంద కంటే ఎక్కువ కొత్త కేసులే ఉనికిలోకి వస్తూ ఉంటే మహారాష్ట్రలో మాత్రం 800 దాకా నమోదవుతున్నాయి. అనేక జిల్లాల్లో ఇటీవలి వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నా ఇప్పుడు అక్కడ అదుపులోకి వచ్చాయి. కానీ, కొత్తగా పుట్టుకొస్తున్నవన్నీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే. కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం… సుమారు 80 జిల్లాల్లో గత రెండు వారాలుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. మరో 15 జిల్లాల్లో నాలుగు వారాలుగా పాజిటివ్ కేసు రాలేదు. దీంతో మొత్తం 430 జిల్లాల్లో దాదాపు 95 జిల్లాలు కరోనా-ఫ్రీ అయిపోయాయి.
మెజారిటీ కేసులు ముంబయిలోనే…
పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినా ఇంకొన్ని చోట్ల కొత్త కేసులు భారీ సంఖ్యలో పుడుతున్నాయి. మహారాష్ట్రనే పరిగణనలోకి తీసుకుంటే మెజారిటీ కేసులు ముంబయి నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పూణె, థానె నగరాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో సైతం భోపాల్, ఇండోర్ నగరాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వైరస్ ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య తగ్గిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వారాలుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదు. మార్చి మూడో వారం వరకూ విదేశీ ప్రయాణికుల ద్వారా వచ్చిన వైరస్ ఆ తర్వాత మర్కజ్ యాత్రకు వచ్చినవారి ద్వారా వేగంగా వ్యాప్తి చెందింది. గుజరాత్ విషయంలో మాత్రం మర్కజ్ ప్రభావం పెద్దగా లేకపోయినా ఢిల్లీ కంటే వేగంగా వైరస్ వ్యాప్తి చెందింది. వారం వ్యవధిలోనే డబ్లింగ్ మార్కును దాటి రెండున్నర రెట్లు పెరిగింది.
Tags: Corona, Positive Cases, Maharashtra, Gujarat, Telangana, Andhra Pradesh, Speed spread