- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత్యక్రియలకు బ్రేక్.. సాధారణ మృతదేహం కాదంటా!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. ఈ మహమ్మారి రాకతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. అన్ని రంగాలను ఎక్కడికక్కడ కుదిపేసింది. అంతేకాదు మానవుల సంబంధాలపై గట్టి దెబ్బే కొట్టింది. బంధాలు, బంధుత్వాలను మరిచేలా.. ప్రతి మనిషి ప్రాణం విలువను చూపిస్తునే.. చావును కూడా పరిచయం చేస్తోంది ఈ వైరస్. చివరకు చనిపోయిన మృతదేహం పైన కూడా నేను ఇంకా బతికే ఉన్నాను అంటూ హడలెత్తిస్తుంది. ఇటువంటి ఓ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బోమ్మూరులో ఓ వృద్ధుడి అంత్యక్రియలకు బ్రేక్ పడింది. తీరా చనిపోయాక ఆ వృద్ధుడి మృతదేహానికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అంత్యక్రియలకు సిద్ధంగా ఉన్న మహాప్రస్థానం వాహనం వెనుదిరిగింది. అప్పటివరకు సాధారణ మృతదేహంగా భావించిన బంధువులు, స్థానికులు ఉదయం నుంచి ఇంటి వద్దనే ఉంచారు. చివరకు పాజిటివ్ అని తేలగానే ఎక్కడొళ్లక్కడ వెళ్లిపోయారు. దీంతో ఆ శవం వద్ద ఎవ్వరూ లేకపోవడంతో అంత్యక్రియలు అర్ధంతరంగా నిలిచిపోయాయి.