- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దూసుకొస్తున్న 'మంకీఫాక్స్' ముప్పు.. అప్రమత్తమైన కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీఫాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు చేపట్టింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది.
దేశంలో మంకీఫాక్స్ కేసులు నమోదైన పక్షంలో ఆ వ్యాధి సోకిన వారిపై నిఘా పెట్టి, వేగంగా రోగులను గుర్తించాలని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధికి గురైన వారిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, 21 రోజులపాటు వారిని పరిశీలిస్తూ లక్షణాలు, సంకేతాలను గుర్తించాల్సి ఉంది. వ్యాధికి గురైన వ్యక్తి వాడిన పరుపుతో సహా ఏ వస్తువును తాకకుండా తక్కినవారు జాగ్రత్తపడాలని, ఇతరులనుంచి రోగిని వేరు చేయాలని, చేతులు శుభ్రపర్చుకోవాలని, వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)ని ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
మంకీఫాక్స్ ఒక అంటువ్యాధిగా పశ్చిమ ఆఫ్రికా దేశాలతోపాటు, అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, స్విట్జర్లండ్ వంటి అంటువ్యాధులు సోకని దేశాలకూ వ్యాప్తి చెందడంతో కేంద్రం అప్రమత్తమైంది.
మంకీఫాక్స్ నివారణ మార్గ దర్శకత్వ సూత్రాలు
= వ్యాధి సోకిన వారు వాడిన ఏ వస్తువునూ ఇతరులు తాకకూడదు.
= బెడ్డింగ్ కూడా రోగితో కాంటాక్టు అయి ఉండవచ్చు.
= వ్యాధి సోకిన వారితో కాంటాక్ట్ అయినవారు తమ చేతులు బాగా శుభ్రపర్చుకోవాలి.
= ఆల్కహాల్ కలిసిన హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి.
= చేతులను సోపుతో శుభ్రపర్చుకోవాలి.
= పేషెంట్‌ని పరీక్షించినవారు తప్పక మాస్కులు, గ్లౌవ్స్‌లు తప్పక అందించాలి.
= ఒంటిమీద బుడిపెలు పూర్తిగా తగ్గేంత వరకు గర్బిణులతో క్లోజ్ కాంటాక్ట్ వద్దు.