- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్..
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గత వారం కరోనా కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో సౌకర్యాలపై నేటి నుంచి రెండు రోజుల పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మాక్ డ్రిల్ ప్రారంభించింది. కోవిడ్ నిర్వహణ సంసిద్ధతను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సోమవారం మాక్ డ్రిల్ మొదలుపెట్టగా, మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, ఐసోలేషన్, ఆక్సిజన్ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్, ఐసీయూ బెడ్‌ల వివరాలను ఈ మాక్ డ్రిల్‌లో సేకరించనున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల వివరాలను తెలుసుకోనున్నారు. దీంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు (ఎన్-95), వెంటిలేటర్ల సంఖ్య వంటి కీలక అంశాలను గుర్తించి వైద్యారోగ్య శాఖకు నివేదిస్తారు. హరియాణాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో జరిగిన మాక్ డ్రిల్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పరిశీలించారు. కాగా, భారతదేశంలో సోమవారం రోజువారీ కోవిడ్ -19 కేసులలో స్వల్ప పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,880 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఆదివారం ఒక్కరోజే 5,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 35,199కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.