కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి.. ధృవీకరణ

by Shamantha N |
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి.. ధృవీకరణ
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాపించే సామర్థ్యం గల వైరస్ అని అమెరికా టాప్ మెడికల్ బాడీ ధ్రువీకరించింది. శ్వాస క్రియ సమయంలో పేషెంట్ నుంచి వైరస్ వ్యాప్తి కారకాలు విడుదలవుతాయని, కొన్ని తుంపర్లు రూపంలో భూమ్యాకర్షణతో కిందపడగా, మరికొన్ని అత్యంత సూక్ష్మంగా ఉండి గాలిలో కొన్ని గంటలపాటు నిలిచి ఉండే ముప్పు ఉన్నదని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది. తన గైడ్‌లైన్స్‌నూ ఇందుకు అనుగుణంగా శుక్రవారం సవరించుకుంది.

మానవులు మాట్లాడేటప్పుడు కొన్ని శ్వాససంబంధ ద్రవాలు బయటకు వస్తాయని, కొంచెం పెద్ద సైజులో ఉన్న డ్రాప్లెట్స్ నిమిషాల వ్యవధి గాలిలో ఉంటే, సూక్ష్మ తుంపర్లు గంటల వరకూ ఉండే ముప్పు ఉన్నదని తెలిపింది. ఇండోర్‌లలో కనీసం 15 నిమిషాలు పేషెంట్ ఉంటే, ఆయన ద్వారా విడుదలైన వైరస్ గాఢత పెరిగి ఇతరులకు సోకే అవకాశముందని, ఆరడుగుల దూరంలో ఉన్నా, ఇది సాధ్యపడవచ్చునని పేర్కొంది. గాలి ద్వారా కరోనా సోకే ముప్పు ఉన్నదని లాన్సెట్ జర్నల్ వాదించిన సుమారు నెల తర్వాత సీడీసీ ఏకీభవించింది. ఇటీవలే డబ్ల్యూహెచ్‌వో కూడా గాలి ద్వారా సోకే అవకాశముందని అంగీకరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed