కరోనా పెరిగిపోతోంది.. మమ్మల్ని ఆదుకోండి: మోదీతో జగన్

by srinivas |
కరోనా పెరిగిపోతోంది.. మమ్మల్ని ఆదుకోండి: మోదీతో జగన్
X

కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈనెల 14తో లాక్‌డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎలాంటి ఫలితాలనిచ్చింది? అన్నదానిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, నిరోధంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా సీఎం ఏపీలో రెండు రోజుల్లో కేసులు వేగంగా పెరిగిపోయిన తీరును వివరించారు. ఏపీలో ఇప్పటివరకు 132 కేసులు నమోదయ్యాయని ప్రధానికి చెప్పారు. ఇందులో 111 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌ మార్కజ్‌లో పాల్గొన్నవారేనని, ఇతరులు వారితో సన్నిహితంగా ఉన్నవారని తెలిపారు.

ఏపీలో కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నామని పీఎంకు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని చెప్పారు. కాగా, కరోనా కట్టడి నేపథ్యంలో చేపట్టిన చర్యలతో ఏపీ ఆదాయం బాగా దెబ్బతిందని, రాష్ట్రాన్ని ఆదుకోవాలని మోదీని జగన్ కోరారు. కరోనా కట్టడికి వైద్య పరికరాలను అందించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు.

Tags: pm modi, modi video coference, ysrcp, jagan, rajnath singh, amith sha, corona virus

Advertisement

Next Story

Most Viewed