యూకేలో డెల్టా వేరియంట్ విజృంభణ..

by vinod kumar |   ( Updated:2021-06-04 05:51:29.0  )
యూకేలో డెల్టా వేరియంట్ విజృంభణ..
X

లండన్: భారత్‌లో తొలిసారి వెలుగుచూసి కరోనా వైరస్ డెల్టా వేరియంట్ యునైటెండ్ కింగ్‌డంలో విజృంభిస్తున్నది. యూకేలో వెలుగుచూసిన ఆల్ఫా కంటే డెల్టా డామినేషన్ ఎక్కువగా ఉన్నది. ల్యాబరేటరీ విశ్లేషణల ద్వారా ఈ కేసుల గుర్తింపు వారంలో 79శాతం పెరిగాయి. డెల్టా వేరియంట్ బారినపడ్డ వారు హాస్పిటల్‌ పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. వారంలో 278 మంది డెల్టా బారినపడ్డ పేషెంట్లు హాస్పిటల్స్‌లో చేరినట్టు అధికారిక సమావేశంలో వెల్లడించింది. రిస్క్ సంబంధ వాదనలను బలపరచడానికి మరింత సమాచారం రావాల్సి ఉన్నదని వివరించారు.

యూకేలో డెల్టా వేరియంట్ విజృంభిసస్తున్న నేపథ్యంలో వీలైనన్నీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్సీ హారిస్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో జూన్ 21న అన్ని లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయనున్నారు. కాబట్టి, తదుపరి రోడ్‌మ్యాప్ అమలు చేసే వరకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed