- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేషన్.. ఇట్స్ టైం ఫర్ ‘ఫ్రంట్ లైన్ వర్కర్స్’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ శుక్రవారంతో పూర్తికానుంది. శనివారం నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో 1.09 లక్షల మందికి టీకాలు వేశామని, ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లలో 76,376 మందికి వేసినట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్ల సంఖ్య 1.88 లక్షలకు చేరిందన్నారు. ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది మొత్తం 1.76 లక్షల మంది ఉంటే అందులో 64% మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు.
ప్రైవేటు రంగంలోని హెల్త్ కేర్ సిబ్బంది మొత్తం 1.54 లక్షల మంది ఉంటే ఇందులో 49% మంది మాత్రమే తీసుకున్నారని, శుక్రవారం సాయంత్రం తర్వాత ఇక హెల్త్ కేర్ సిబ్బందికి టీకాలు ఉండవని స్పష్టం చేశారు. జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలైందని, శుక్రవారం సాయంత్రంతో మొదటి డోస్ పూర్తవుతుందని, ఈ నెల 13 నుంచి రెండో డోస్ మొదలవుతుందని తెలిపారు. ఇకపై ప్రతి రోజూ (కొన్ని సందర్భాల్లో ఆదివారం మినహా) వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 1.87 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉంటారని అంచనా వేశామన్నారు. పోలీసులు, రెవెన్యూ, స్థానిక సంస్థల్లోని పారిశుధ్య కార్మికులందరికీ ఐదు రోజుల్లోనే వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవాగ్జిన్ టీకా..
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.88 లక్షల మందికి ఇచ్చిన టీకాలన్నీ పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన ‘కొవిషీల్డ్’ కంపెనీకి చెందినవేనని, ఇకపై ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇచ్చే టీకాల్లో ‘కొవాగ్జిన్’ కంపెనీవి కూడా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా ‘కొవాగ్జిన్’ టీకాలను ఇవ్వలేదన్నారు. అయితే ఏయే జిల్లాలకు ‘కొవాగ్జిన్’ ఇవ్వనున్నదీ గోప్యంగానే ఉంచుతామని, కంప్యూటర్ ద్వారానే ‘రాండమ్’గా ఏయే జిల్లాలకు పంపేది నిర్ణయిస్తామని ఆ అధికారి వివరించారు. ‘కొవాగ్జిన్’ టీకా తీసుకునే వారంతా విధిగా ‘కన్సెంట్ లెటర్’పై సంతకం చేసి వ్యాక్సిన్ కేంద్రంలోని స్పెషల్ ఆఫీసర్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.